Breaking News

Hot

మరోసారి పోలీస్ రోల్ లో అదరగోట్టనున్న రవితేజ

Ravi Teja Character in Touch Chesi Chudu Movie

Movie Updates

Rede Tv Channel
Image From Redereader.com

“విక్రమార్కుడు” “మిరపకాయ్” “పవర్” ఈ సినిమాల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా ఆడియన్స్ అందరిని మెప్పించాడు. మాములుగానే ఫుల్ ఎనర్జీతో నటించే రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అయితే మరింతగా రెచ్చిపోతాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న రవితేజ కి “రాజా ది గ్రేట్” ద్వారా మంచి కమర్షియల్ హిట్ లభించింది. ఇదిలా ఉంటే ఈమధ్య సోషల్ మీడియాలో పోలీస్ గెటప్ లో ఉన్న రవితేజ కొత్త స్టిల్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

అయితే ఈ స్టిల్స్ “టచ్ చేసి చూడు” మూవీ లో నుంచి అని అర్ధం అవుతుంది. విక్రం సిరికొండ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఈ స్టిల్స్ చూస్తే అర్ధం అవుతుంది. చూస్తుంటే పోలీస్ గెటప్ లో మరోసారి మాస్ మహారాజ్ అదరగోట్టేయడం ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి.

ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన రాశి ఖన్నా ఇంకా సీరత్ కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశ లో ఉన్న ఈ మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు.

No comments