Breaking News

Hot

త్వ‌ర‌లో శృతి హాస‌న్ పెళ్లి - Sruthi Hassan Marriage

Sruthi Hassan Marriage

Movie Updates

Rede Tv Channel
Image From Redereader.com

కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వస్తాడో లేదో తెలియ‌దు. కానీ ఆయన కూతురు శృతి హాసన్ మాత్రం పెళ్లిపీట‌లు ఎక్క‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆమె త‌న ప్రియుడ్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంది.

స్వీట్‌ హార్ట్‌ నెక్‌ లైన్‌ కట్‌ ఉన్న ఓ తెల్లటి మ్యాక్సీ డ్రెస్‌ వేసుకుని, జుట్టును బన్ను లాగా ముడేసుకుని, చెవులకు రెండు స్టేట్‌మెంట్‌ దుద్దులు పెట్టుకుని ఎంతో క్యాజువల్‌గా, ఎంతో సింపుల్‌గా తన సంతోషం బయట పడకుండా బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సేల్‌తో, తల్లి సారికతో కలిసి ఓ హై క్లాస్‌ రెస్టారెంట్‌లో లంచ్‌ చేశారట శృతి హాసన్‌! రెండేళ్ల నుంచీ శృతి, కోర్సేల్ ల‌వ్ స్టోరీ న‌డుస్తోంది. దీంతో దీనికి ముగింపు ప‌లికేందుకు వీరిద్దరూ నిర్ణ‌యించార‌ట‌.

ఇందులో భాగంగా శృతి త‌ల్లి సారికతో మీటింగ్ పెట్టార‌ట‌. రెస్టారెంట్‌లో లంచ్‌కి పిలిచి పెళ్లిపై మాట్లాడార‌ని తెలుస్తోంది. ముగ్గురు ఆనందంగా బ‌య‌ట‌కు రావ‌డాన్ని చూస్తే పెళ్లి ఫిక్స్ అయింద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.

No comments