తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్న మెగా స్టార్ హీరోయిన్ - Raai Laxmi Julie - 2 Movie Flop
Raai Laxmi Julie - 2 Movie Flop
Movie Updates
Rede Tv Channelతెలుగు లో హీరోయిన్ గా ట్రై చేసి చేసి కోలీవుడ్ కి వెళ్ళిన భామ లక్ష్మి రాయ్. అక్కడ కూడా హీరోయిన్ గా సక్సెస్ కాలేక ఐటెం సాంగ్స్ చేసి తన క్రేజ్ ని పెంచుకుంది లక్ష్మి రాయ్. అయితే ఇక్కడ లాభం లేదు అని చెప్పి రీసెంట్ గా బాలీవుడ్ వెళ్లి “జూలీ2” అనే మూవీ చేసోచ్చింది లక్ష్మి రాయ్. ఈ మూవీ తో కూడా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. మొదటిసారి బాలీవుడ్ పరిశ్రమలో తన లక్ పరీక్షించుకోవాలని ఎన్నడూ లేని విధంగా హాట్ గా కనిపించి హిట్ కొట్టాలి అని గట్టి ప్రయత్నమే చేసింది. కానీ మొదటిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది “జూలీ 2”.
అయితే ఈ సినిమా ఫ్లాప్ అనే నిజాన్ని ఒప్పుకుంది లక్ష్మి రాయ్. “అవును నా సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇదొక సెక్స్ సినిమాలాఉంటుందని ప్రేక్షకులు ఆశించారు. ప్రమోషన్స్ కూడా అదే యాంగిల్ లో జరిగింది. టీజర్ మొత్తం ఎరోటిక్ గా ఉంటుంది. కానీ సినిమాలో సెక్స్ లేదు. దీనికి తోడూ విమర్శకులు కూడా మా సినిమాపై విరుచుకుపడ్డారు. ఇదంతా నాకొక మంచి ఎక్స్ పీరియన్స్” అని తన ఫ్లాప్ సినిమా గురించి చెప్పుకొని బాధపడింది లక్ష్మి రాయ్.
No comments