రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరం తేజ్ - Sai Dharam Tej Rumours
Sai Dharam Tej Rumours
Movie Updates
Rede Tv Channelమెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన “జవాన్” మూవీ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియా లో సాయి ధరం తేజ్ పై ఒక రూమర్ హల్‌చల్ చేస్తుంది. అదేంటి అంటే మహేష్ బాబు ఇంకా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వస్తున్న మూవీ లో సాయి ధరం తేజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు అని. ఈ న్యూస్ రాగానే మెగా ఫాన్స్ అందరూ ఎంతో సంతోషపడ్డారు.
అయితే ఈ విషయం పై సాయి ధరం తేజ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్పందిస్తూ అవన్నీ రూమర్స్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన దృష్టి సోలో హీరో గా చేసే మూవీస్ పైనే ఉందట. మల్టీ స్టారర్ చేసే టైం వస్తే తప్పకుండ నటిస్తాను అని చెప్పాడు సాయి ధరం తేజ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం వినాయక్ ఇంకా కరుణాకరన్ దర్శకత్వం లో వచ్చే మూవీస్ తో సాయి ధరం తేజ్ బిజీ బిజీ గా ఉన్నాడు.
No comments