Breaking News

Hot

‘ఆక్సిజన్’ సినిమా రివ్యూ - Oxygen Movie Review

Oxygen Movie Review

Movie Updates

Rede Tv Channel
Image From Redereader.com

సక్సెస్ కి మొహం వాచిపోయిన గోపిచంద్ చాలా హోప్స్ పెట్టుకుని చేసిన సినిమా ఆక్సిజన్. తన మార్కెట్ బాగా డౌన్ అయిన పరిస్థితుల్లో డూ ఆర్ డై లాగా చేసిన ఈ మూవీ చాలా కాలంగా వాయిదా పడుతూ, పడుతూ లేస్తూ ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ కు వచ్చేసింది. మరి గోపిచంద్ పెట్టుకున్న ఆశలు నెరవేర్చేలా ఆక్సిజన్ ఉందా లేదా అనేది చూద్దాం.

దేశ యువతను నాశనం చేస్తున్న డ్రగ్ సిగరెట్లు తయారు చేసే కంపెనీ ఓనర్ శ్రీపతి(నాగినీడు). వీటి వల్ల ఆర్మీ కమాండర్ సంజీవ్(గోపిచంద్)తమ్ముడు కాన్సర్ తో చనిపోతాడు. దీంతో ఆ రాకెట్ పని పట్టే ఆక్సిజన్ అనే ఆపరేషన్ మొదలుపెడతాడు సంజీవ్. ఈ క్రమంలో సంజీవ్ లవర్ డాక్టర్ గీత(అను ఇమ్మాన్యుయేల్), అమ్మానాన్న అందరూ ప్రమాదంలో చనిపోతారు. దీంతో పగబట్టిన సంజీవ్ పథకం ప్రకారం శ్రీపతి తమ్ముడు రఘుపతి(జగపతిబాబు)కూతురు శృతి(రాశి ఖన్నా)పెళ్లి చూపులకు వెళ్తాడు. తర్వాత అసలు విలన్ ని పట్టే పనిని మొదలెడతాడు. సంజీవ్ దేశం కోసం ఈ మిషన్ ని చివరికి సాధించాడా లేదా అనేది ఆక్సిజన్ అసలు కథ.

గోపిచంద్ నటనలో ప్రత్యేకంగా ఎత్తిచూపడానికి ఏమి లేదు. తనకు అలవాటైన ధోరణిలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో వేరియేషన్స్ బాగా చూపించాడు. అమాయకుడిగా, ఫ్యామిలీని నాశనం చేసిన వాళ్ళ అంతు చూసే ఎమోషనల్ ఆర్మీ మ్యాన్ గా మెప్పించాడు. కానీ గతంలో చూసిన ఎన్నో సినిమాల మిక్సీ లాగా అనిపిస్తుంది. అందుకే కొత్తదనం కనిపించదు. రాశి ఖన్నా నామ్ కే వస్తే లా ఉంది తప్ప చెప్పుకోదగ్గ పాత్ర కాదు. అను ఇమ్మాన్యుయేల్ నటించే స్కోప్ ఉన్న రోల్ కానీ ఫినిషింగ్ ఇబ్బంది కలిగిస్తుంది. మెయిన్ విలన్స్ గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ తమకు అలవాటైన పాత్రలో రొటీన్ గా చేసుకుంటూ పోయారు. వీళ్ళు కాకుండా సినిమా నిండా చాలా పెద్ద సైన్యమే ఉంది. కాని ప్రాధాన్యత పెద్దగా లేకపోవడంతో ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం పడలేదు.

దర్శకుడు జ్యోతి కృష్ణ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న ఒక కీలక సమస్యని నేపథ్యంగా తీసుకున్నాడు. కానీ కమర్షియల్ గా మెప్పించాలనే తాపత్రయంలో పూర్తిగా బాలన్స్ తప్పాడు. కథ పరంగా ఠాగూర్, అపరిచితుడు రేంజ్ లో మెప్పించే అవకాశాన్ని చేతులారా పాడు చేసేసుకున్నాడు. గోపిచంద్ సినిమా అంటే కొన్ని సూత్రాలకు లోబడే తీయాలి అనే లెక్కలు ఇక్కడ పూర్తిగా తేడా కొట్టాయి. అందుకే పది నిమిషాలు సినిమా బాగుంది అనిపిస్తే మరో ఇరవై నిమిషాలు ఇదేంటి ఇలా ఉంది అనిపించేలా చేసాడు. యువన్ శంకర్ రాజా వరస్ట్ ఆల్బమ్స్ లో దీనికి టాప్ ప్లేస్ ఇవ్వొచ్చు. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా మటుకు కాపాడింది. చోటా కె నాయుడు, వెట్రి కెమెరా పనితనం స్క్రీన్ మీద గొప్ప క్వాలిటీ ఇచ్చింది. ఎఎం రత్నం నిర్మాణం మాత్రం చాలా రిచ్ గా ఉండటం రెండున్నర గంటలు కూర్చునేలా చేసింది.

ఆక్సిజన్ మంచి మెసేజ్ తో గొప్పగా ఉండాల్సిన స్థానంలో ఒక బిలో యావరేజ్ యాక్షన్ మూవీగా మిగిలిపోయింది. గత సినిమాలతో పోల్చుకుని గోపిచంద్ ఫ్యాన్స్ కొంతవరకు సంతృప్తి పడవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది మింగుడుపడని వ్యవహారమే. సాగతీత బాగా ఎక్కువ కావడంతో ఆక్సిజన్ ఏ వర్గానైనా యునానిమస్ గా మెప్పించడం కష్టమే.

No comments