Breaking News

Hot

రామ్ చరణ్ కి అన్నగా ఆది పినిశెట్టి - Aadi Pinisetty Revealed His Character in Ram Charan's Rangasthalam 1985

Aadi Pinisetty Revealed His Character in Ram Charan's Rangasthalam 1985

Movie Updates

Rede Tv Channel
Image From Redereader.com

తెలుగు సినిమాల్లో స్టైలిష్ అండ్ కూల్ విలన్ గా ఆది పినిశెట్టి ఈమధ్య అదరగోడుతున్నాడు. “సరైనోడు” లో ఆది పినిశెట్టి విలన్ గా చేసిన తీరు మన దర్శకులని ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ అందరు ఆది పినిశెట్టి ని విలన్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” మూవీ లో నటిస్తున్న ఆది పినిశెట్టి, రామ్ చరణ్ ఇంకా సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న “రంగస్థలం 1985” లో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ లో రామ్ చరణ్ కి అన్నగా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు అనే టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

అంతేకాక ఆది చేసే పాత్ర రామ్ చరణ్ చేసే పాత్రతో ఈక్వల్ గా ఉంటుందట. రామ్ చరణ్ పాత్రపై ఆది పాత్ర ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే పాత్ర అంటున్నారు. మరి సుకుమార్ తన మేకింగ్ స్టైల్ తో రామ్ చరణ్ ఇంకా ఆది పినిశెట్టిలని ఎలా చూపిస్తాడా అని అందరు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ ని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారట.

No comments