అల్లు అర్జున్ మార్కెట్‌పై కన్నేసిన పవన్ కళ్యాణ్ - Pawan Kalyan Focusing Malayalam Audience
Pawan Kalyan Focusing Malayalam Audience
Movie Updates
Rede Tv Channelఅల్లు అర్జున్ ఇంకా పవన్ కళ్యాణ్ కి మధ్య కొంత గ్యాప్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. పబ్లిక్ గా కూడా వీళ్ళు ఎక్కువ గా కలుసుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనుకోకుండా బన్నీకి చెక్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. మలయాళం లో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోస్ కి ఈక్వల్ గా బన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి.
అయితే ఇప్పుడు మలయాళం మార్కెట్ పై కన్నేశాడు పవన్. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కు అక్కడ అంతగా క్రేజ్ లేకపోయినా ఆమధ్య వచ్చిన “కాటమరాయుడు” మలయాళ డబ్బింగ్ ప్రేక్షకులకి బాగా నచ్చింది. దాంతో పవన్ “అజ్ఞాతవాసి” సినిమాని కూడా మలయాళంలోకి డబ్ చేసి తెలుగు వెర్షన్ తో పాటు ఒకేసారి విడుదల చేయబోతున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ సినిమాలకి నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమాని అదే పేరుతో మలయాళంలోకి డబ్ చేసి జనవరి 10 న విడుదల చేయబోతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే బన్ని మార్కెట్ పై పవన్ కళ్యాణ్ కన్నేసాడని అర్ధం అవుతుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు ఆడియో లాంచ్ ని డిసెంబర్ మూడో వారం లో చేద్దాం అని గ్రాండ్ గా ప్లాన్ చేసారు నిర్మాతలు.
No comments