‘జవాన్’ సినిమా రివ్యూ - Jawan Movie Spot Review
Jawan Movie Spot Review
Movie Updates
Rede Tv Channelసుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ గత రెండు మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఎంతో కసి గా హిట్ కొట్టాలి అని చెప్పి డైరెక్టర్ బివిఎస్ రవి తో కలిసి “జవాన్” మూవీ చేసాడు సాయి ధరం తేజ. మరి ఫ్లాప్స్ లో ఉన్న సాయి ధరం తేజ్ కి అలాగే బివిఎస్ రవికి “జవాన్” మూవీ హిట్ ని తెచ్చిపెట్టిందా లేదా అనేది చూద్దాం.
ఇక ఈ మూవీ కథ విషయం లోకి వెళ్తే, చిన్నప్పటినుంచి దేశ భక్తితో పెరిగిన యువకుడు జై (సాయి ధరం తేజ్). నరనరానా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా అనే సంకల్పం ఉన్నవాడు. డిఆర్డిఓ లో ఎలాగైనా సైంటిస్ట్ గా జాబ్ సంపాదించాలి అనే గోల్ తో హ్యాపీ గా ఫ్యామిలీ తో కలిసి లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. అదే టైం కి భారత దేశాన్ని కాపాడడానికి ఉపయోగించే ఒక మిసైల్ ని తయారు చేస్తారు డిఆర్డిఓ సైంటిస్ట్లులు. ఆ మిసైల్ ని ఉగ్రవాదులకి అప్పగించే డీల్ ని ఒప్పుకుంటాడు కేశవ్ (ప్రసన్న). కేశవ్ ఆ మిసైల్ ని కొట్టేసే ప్రాసెస్ లో అనుకోకుండా జై , కేశవ్ వేసిన ప్లాన్ కి అడ్డు పడతాడు. తరువాత కేశవ్ యొక్క ప్లాన్ ని గ్రహించిన జై ఆ మిసైల్ ని కేశవ్ కి ఉగ్రవాదులకి దక్కకుండా ఎలా చేసాడు అనేదే మిగిలిన కథ.
ంతకు ముందు మూవీస్ తో పోలిస్తే సాయి ధరం తేజ్ ఈ మూవీ లో చాలా హుందాగా నటించాడు. మునుపటి మూవీస్ లో లాగ ఒకే పంధాలో కాకుండా కొంచెం బాధ్యతగల పౌరుడి పాత్రలో సాయి ధరం తేజ్ బాగా చేసాడు. ఇక డబ్బుకోసం ఉగ్రవాదులకి సాయం చేసే వ్యక్తి గా తమిళ హీరో అయిన ప్రసన్న పర్వాలేదు అనిపించాడు. ఇక మూవీ లో మెహ్రిన్ పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఎందుకంటే అసలు కథలో మెహ్రిన్ ఎందుకు ఉందో కూడా ఎవరికీ అర్ధం కాదు. నటనలో అమ్మడు డల్ అయినా గ్లామర్ షో లో మాత్రం మాస్ ని ఆకట్టుకుంటుంది. ఇకపోతే సీనియర్ యాక్టర్ అయిన కోట శ్రీనివాస్ రావు ఉన్న కాసేపు తన నటన తో కథ కి చాలా హెల్ప్ చేసారు. సుబ్బరాజు, సత్యం రాజేష్ తదితరులు తమ పరిమితుల మేరకు బానే మెప్పించారు.
ఇకపోతే ఈ మూవీ కి కెమెరా వర్క్ ని అందించిన కె.వి. గుహన్ తన వర్క్ తో అంతగా ఆకట్టులేకపోయాడు. అక్కడక్కడా కొన్ని షాట్స్ బాగున్నా కాని మూవీ ఎమోషన్ కి క్యారీ చేయలేకపోయాడు కె.వి.గుహన్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించినా గాని మ్యూజిక్ మాత్రం బాలేదు అని చెప్పొచ్చు. సాయి ధరం తేజ్ కి హిట్ సాంగ్స్ ని ఇచ్చిన తమన్ ఈ మూవీ కి ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ గా కంటే కూడా బివిఎస్ రవి రైటర్ గా ఈ మూవీ కి ప్రాణం పోసాడు. దేశం గురించి, సక్సెస్ గురించి హీరో చెప్పే మాటలు బాగున్నాయి. అలాగే స్క్రీన్ ప్లే లో కొన్ని తప్పులు ఉన్న గాని తన మాటల తో ఆ తప్పుల్ని కవర్ చేసే పని చేసాడు రవి. కాని దర్శకత్వం లో మాత్రం రవి చాలా వీక్ అని తెలిసిపోయింది. సీన్ లో ఎమోషన్ ఉన్నా గాని తన టేకింగ్ వల్ల ఆ ఎమోషన్ ని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయలేకపోయాడు బివిఎస్ రవి. ఫైనల్ గా మంచి కథ తో వచ్చిన బివిఎస్ రవి కథకి పట్టులేని కథనాన్ని తయారు చేసుకొని మూవీ తీసినట్టు అనిపించింది.
మొత్తానికి సాయి ధరం తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన “జవాన్” మూవీ తేజు కి సక్సెస్ ని అందించడం కష్టమే అనిపిస్తుంది. అలాగే బివిఎస్ రవికి కూడా ఈ మూవీ డైరెక్టర్ గా కంటే కూడా రైటర్ గా మంచి పేరు తీసుకువస్తుంది. ఫైనల్ గా కమర్షియల్ మూవీస్ ని చూసే వాళ్ళు “జవాన్” పై ఒక లుక్ వేసి రావొచ్చు.
No comments